Share News

Antibiotics అతిగా యాంటి బయాటిక్స్‌ వాడరాదు

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:09 AM

Avoid Overuse of Antibiotics అతిగా యాంటి బయాటిక్స్‌ ట్యాబ్లెట్లు వాడరాదని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్య క్రమం నిర్వహించారు.

 Antibiotics అతిగా యాంటి బయాటిక్స్‌ వాడరాదు
అవగాహన కార్య క్రమంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అతిగా యాంటి బయాటిక్స్‌ ట్యాబ్లెట్లు వాడరాదని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యుల సూచనలు పాటించ కుండా ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ వాడరాదన్నారు. వాటిని అధిక మోతాదులో వాడితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ తర్వాత చికిత్స అందించడం మరింత కష్టతరమవుతుందని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించి యాంటీ బయాటిక్స్‌ ట్యాబ్లెట్లు వాడాలని సూచించారు. వైద్యుల చీటీ లేకుండా ఎవరైనా ఆ మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐవో వైవిజయ్‌మోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ప్రోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, రఘు కుమార్‌, కౌశిక్‌, మణి, సూపరింటెండెంట్‌ కామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:09 AM