పీ-4పై చౌకబారు విమర్శలు మానుకోండి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:06 AM
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్నిచంద్రబాబు ఏర్పాటు చేసి, దానిపై ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున తెలిపారు. అటువంటి కార్యక్రమం గురించి ఎమ్మెల్సీ బొత్స, చిన్న శ్రీనులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.
విజయనగరం రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్నిచంద్రబాబు ఏర్పాటు చేసి, దానిపై ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున తెలిపారు. అటువంటి కార్యక్రమం గురించి ఎమ్మెల్సీ బొత్స, చిన్న శ్రీనులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.మంగళవారం విజయనగరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ జిల్లాలో అవినీతి సామ్రాట్‌లన్న విషయం ఎవరిని అడిగిగా చెబుతారన్నారు. 2019-24 కాలంలో కోట్లాది రూపాయలు వీరు దోచుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురించి వీరిద్దరూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆయన విజన్ ఉన్న నాయ కుడన్నారు. తొలిసారి ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన గజపతినగరం నియోజకవర్గం, జిల్లాను ముందుకు నడిపించేందుకు అహర్నిశలు శ్ర మిస్తున్నారన్నారు. అటువంటి ఆయనపై ఎమ్మెల్సీ బొత్స, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను విమర్శించడం తగదన్నారు. ఏడాది పాలనలో సూపర్‌సిక్స్‌లో ఇప్పటికే కొన్ని హామీలు అమలయ్యాయని, వచ్చేనెలఖరులోగా సూపర్‌సిక్స్‌లో మరికొన్ని హా మీలు అమలు కానున్నాయన్నారు. సమా వేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, ప్రసాదరావు,పాణిఫాణీరాజు, బంగారుబాబు పాల్గొన్నారు.