Share News

ఆటో కార్మికులను ఆదుకోవాలి

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:25 AM

కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణసౌకర్యంకల్పిస్తుండడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వైనాయుడు డిమాండ్‌ చేశారు.

 ఆటో కార్మికులను ఆదుకోవాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఆటో కార్మికులు

మక్కువ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణసౌకర్యంకల్పిస్తుండడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వైనాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక మెయిన్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన కార్య క్రమాన్ని నిర్వహిం చారు. అనంతరం తహసీల్దార్‌ కె.భరత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో యూనియన్‌ నాయకులు నరేష్‌, రామకృష్ణ, దాలయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:25 AM