Share News

ఆటో యూనియన్ల బంద్‌ ప్రశాంతం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:22 AM

జిల్లాలో ఆటో యూనియన్‌, కార్మికుల బంద్‌ బుధ వారం ప్రశాంతంగా జరిగింది.

 ఆటో యూనియన్ల బంద్‌ ప్రశాంతం

విజయనగరం దాసన్నపేట, జూలై 17(ఆంధ్రజ్యో తి): జిల్లాలో ఆటో యూనియన్‌, కార్మికుల బంద్‌ బుధ వారం ప్రశాంతంగా జరిగింది. ఏఐఎఫ్‌టీయూ, సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వెయ్యిమంది ఆటో డ్రైవర్లు స్థానిక కోట జంక్షన్‌ నుంచి మూడు లాంతర్లు, అంబేడ్కర్‌ జంక్షన్‌ కాంప్లెక్స్‌ మీదుగా మయూరి కూడ లికి చేరుకుని మానవహారం చేపట్టారు. ఈసందర్భంగా ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌ పండా మా ట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌక ర్యం కల్పించడంతో ఆటో కార్మికులు వీధిన పడ్డారన్నా రు. తక్షణమే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించా లని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

చీపురుపల్లి: పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు బుధవారం మెయిన్‌ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ప్రతినిధి అంబల్ల గౌరినాయుడు, ఆటో డైవర్ల సంఘం నాయకులు, ప్రతినిధు లు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: ఆటో రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆటో కార్మికులు జరజాపుపేట, మొయిద జంక్షన్‌, రామతీర్థంలో బంద్‌ పాటించారు. ఆటో కార్మకులకు రూ.25వేలు ఇవ్వడంతో పాటు ఉపాధి చూపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 18 , 2025 | 12:22 AM