ఆటో బోల్తా: బాలుడి మృతి
ABN , Publish Date - May 02 , 2025 | 12:18 AM
మండలంలోని గుడివాడ జంక్షన్ వ ద్ద ఆటో బోల్తాపడి బాలుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసు కుంది.
గజపతినగరం, మే1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడివాడ జంక్షన్ వ ద్ద ఆటో బోల్తాపడి బాలుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసు కుంది. ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు తెలిపిన వివరాల మేరకు.. మరుపల్లి గ్రామానికి చెందిన బండి కార్తీక్ (14) అదే గ్రామంలో ఆటో ఎక్కి దత్తి రాజేరు మండలం పెదమానాపురం వెళ్తున్నాడు. గుడివాడ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆటోకు ఎదురుగా కుక్క అడ్డురావడంతో అదుపు తప్పి ఆటో బో ల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సా యంతో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందా డు. మృతుడి తండ్రి విశాఖలో ప్లంబర్‌గా పని చేస్తుంటారు. తల్లి సంతోషి పిల్లలతో పాటు మరుపల్లిలో నివాసం ఉంటున్నారు. మృతుడికి తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.