ఆటో డ్ర్తెవర్లను ఆదుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:22 PM
ప్రభుత్వం ఇటీవల మ హిళలకు ప్రీబస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల బతుకు లు రోడ్డున పడడంతో వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరరావు కోరారు.
తెర్లాం, ఆగస్టు24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇటీవల మ హిళలకు ప్రీబస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల బతుకు లు రోడ్డున పడడంతో వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరరావు కోరారు. ఆదివారం తెర్లాం తహసీల్దార్ కా ర్యాలయం వద్ద ఆటో యునియన్ నాయకులతో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడతూ ప్రీబస్సు అమలు చేసేట ప్పుడు ముందుగా నష్టపోయేది ఆటో నడిపే కార్మికులని వారిని ప్రభుత్వం గూర్తించక పోవడం దారుణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-21 రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హమీని నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్-106 (1)(2) రద్దుచేయాలని కోరారు. ఆటో కార్మికులను ఆదుకోక పోతే చలో విజయవాడ సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు ఎస్.గోపాలం పాల్గొన్నారు.