ఆటో డ్రైవర్లకు రూ.25 వేలు అందించాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:48 PM
స్ర్తీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు అందించి ఆదుకోవా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు ఎం.తిరుపతి రావు కోరారు.
పాలకొండ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): స్ర్తీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు అందించి ఆదుకోవా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు ఎం.తిరుపతి రావు కోరారు. గురువారం పాలకొండలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లా డుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారని, అధికారంలోకి వచ్చి 14 నెలలైనా హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. కాద రాము అధ్యక్షతన జరిగిన నిరసనలో ఆటో, ర్యాలీ, క్యాబ్ డ్రైవర్లు, యూనియన్ ప్రతినిధులు పి.శేఖర్, మహేష్, దురాగరావు పాల్గొన్నారు.