ఆటో ఢీ: వ్యక్తి మృతి
ABN , Publish Date - May 28 , 2025 | 12:34 AM
మండలంలోని సంతపేట జంక్షన్‌కు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్లాపల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొటాన రమేశ్ (40) మృతి చెందాడు.
లక్కవరపుకోట, మే 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సంతపేట జంక్షన్‌కు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్లాపల్లి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొటాన రమేశ్ (40) మృతి చెందాడు. ఎల్. కోట నుంచి సంతపేట వైపు వస్తున్న బైక్‌ను కొత్తవలస నుంచి ఎస్.కోట వెళుతున్న ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నవీన్ పడాల్ తెలిపారు.