Share News

Time Finalized ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:59 PM

Auspicious Time Finalized తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి ఖరీఫ్‌కు నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిలు హాజరుకానున్నారు.

 Time Finalized  ముహూర్తం ఖరారు
యంత్రంతో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం

  • ఖరీఫ్‌ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

గరుగుబిల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి ఖరీఫ్‌కు నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిలు హాజరుకానున్నారు. ఈ ఏడాది ముందస్తుగా నీటి విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రాజెక్టు ఈఈ హెచ్‌.మన్మథరావు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో కాలువల అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఖరీఫ్‌ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాగునీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. కుడి ప్రధాన కాలువ నుంచి ప్రస్తుత ఖరీఫ్‌కు 1.82 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఇదీ పరిస్థితి..

గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని కాలువలు అభివృద్ధిపై దృష్టి సారించలేదు. దీంతో కాలువాలన్నీ పూడికలు, పిచ్చిమొక్కలతో నిండాయి. కొన్నిచోట్ల గండ్లు కూడా పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపింది. కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతీతలకు సుమారు రూ. 3 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధిలో భాగంగా నిధులు కేటాయిం,ఇంది. దీంతో ఉల్లిభద్ర సమీపంలోని కుడి ప్రధాన కాలువ నుంచి విజయనగరం జిల్లా తెర్లాం వరకు ఉన్న 48 కిలో మీటరు వరకు అభివృద్ధి పనులు నిర్వహించారు. ప్యాకేజీ-1లో భాగంగా 48 కిలో మీటర్లు, ప్యాకేజీ-2లో 48 కిలో మీటరు నుంచి 117.89 కిలో మీటరు వరకు రెండు విభాగాలుగా పనులు నిర్వహించారు. ప్యాకేజీ-1లో భాగంగా కాలువ అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. ఉల్లిభద్ర నుంచి 8 ప్రాంతాల్లో అవసరమైన పనులను యంత్రాల సహాయంతో నిర్వహించారు. సాగునీరు దిగువ , శివారు ప్రాంతాలకు ఆటంకం లేకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Updated Date - Jul 04 , 2025 | 11:59 PM