గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:05 AM
మాతా శిశు సంరక్షణ కార్డులో ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి నివేదికల హెచ్చు తగ్గులు గుర్తించిగర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎన్‌ఎంకే తిరుమల ప్రసాద్ తెలిపారు.
గరుగుబిల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):మాతా శిశు సంరక్షణ కార్డులో ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి నివేదికల హెచ్చు తగ్గులు గుర్తించిగర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎన్‌ఎంకే తిరుమల ప్రసాద్ తెలిపారు.శనివారం పీహెచ్‌సీలో పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య శ్రేయస్సుకు వైద్య సిబ్బంది అంకిత భావంతో సేవలందించాలని, గర్భిణుల్లో రక్తహీనత, హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. గ్రామాల నుంచి తనిఖీలు నిమిత్తం వచ్చిన గర్భిణులకు రక్తపరీక్షలు చేయడంతోపాటు పిజం 10 గురించి అవగాహన కల్పించి గర్భిణులకు అందజేస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ ఎన్.జగదీశ్వరి, హెల్త్ విజిటర్ చింతాడ ఉదయకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ పి.శ్రీనివసారావు, అంగన్‌వాడీ వర్కర్లు పల్ల కృష్ణవేణి, రౌతు పద్మ, మూడడ్ల స్వాతి పాల్గొన్నారు.
డీవార్మింగ్ డే కార్యక్రమానికి ఏర్పాట్లు
గరుగుబిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ం పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 12న నిర్వహించనున్న డీవార్మింగ్ డే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యుడు ఎన్‌ఎంకే తిరుమల ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ పిల్లల్లోనులిపురుగల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించనున్నట్లు తెలిపారు. జాతీయ నులిపురుగులు నిర్మూలన కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకుచర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఏడాది నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలు, విద్యార్థులకు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు,కళాశాలల్లో ఆల్బెండజోల్‌మాత్రలు వేస్తామని తెలిపారు. పిల్లల్లో నులి పురుగుల వల్ల రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం సమస్యలు ప్రబలుతున్నాయని చెప్పారు.