Share News

యువతిపై లైంగిక దాడికి యత్నం

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:30 AM

తాగిన మైకంలో వరుసకు పెద్దనాన్న అయిన వ్యక్తే ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు.

యువతిపై లైంగిక దాడికి యత్నం

  • సమీప బంధువే ఘాతుకం

రేగిడి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తాగిన మైకంలో వరుసకు పెద్దనాన్న అయిన వ్యక్తే ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. అటుగా వెళ్లిన యువకులు గుర్తించి అడ్డుకోవడంతో ఘోరం తప్పింది. ఓ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం యువతి బంధువులు నిందితుడిని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేయడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనకు కుమార్తె వరుసైన యువతి పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో వేర్వేరు కారణాలతో యువతి అన్నయ్య, తండ్రి కన్నుమూశారు. దినసరి కూలీయైున తల్లితో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. గురువారం యధావిధిగా తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఎవరూ లేని సమయంలో పెదనాన్న వరుసైన వ్యక్తి ఇంట్లోకి చొరబడి యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో శుక్రవారం నిందితుడిని స్తంభానికి కట్టేసి... దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నీలావతి శుక్రవారం విలేకరులకు తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 12:30 AM