బాలికపై అత్యాచారయత్నం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:20 AM
విజయనగరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)పై అయ్యన్నపేటకు చెందిన మజ్జి కృష్ణవర్ధన్(21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
- యువకుడిపై పోక్సో కేసు నమోదు
నెల్లిమర్ల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)పై అయ్యన్నపేటకు చెందిన మజ్జి కృష్ణవర్ధన్(21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.గణేష్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 2వ తేదీ రాత్రి కృష్ణవర్ధన్.. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను నెల్లిమర్ల శివారు సారిపల్లి టిడ్కో కాలనీకి తీసుకువచ్చాడు. అక్కడ సీ-2 బ్లాక్‌లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నారు. ఆ బ్లాక్‌లోని ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే, నిందితుడు సరాసరి బాలికను ఆ ఖాళీ ఇంటికి తీసుకువచ్చాడా?, లేదంటే ఆ ఇంటి యజమాని నిందితునికి సహకరించాడా? అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతనిపై వివిధ ఘటనలకు సంబంధించి ఆరు కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.