Attacks on Children చిన్నారులపై దాడులను అరికట్టాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:06 AM
Attacks on Children Must Be Prevented చిన్నారులపై దాడులను ప్రతిఒక్కరూ అరికట్టాలని జిల్లా బాలల సంరక్షణాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక వైసీటీసీలో బాలల సంరక్షణ, సంక్షేమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సాలూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): చిన్నారులపై దాడులను ప్రతిఒక్కరూ అరికట్టాలని జిల్లా బాలల సంరక్షణాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక వైసీటీసీలో బాలల సంరక్షణ, సంక్షేమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అడ్డుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులకు విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి. మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీలు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు సమన్వయంతో పనిచే యాలి.’ అని తెలిపారు. బాలలపై ఎక్కడ ఏం జరిగినా తక్షణమే చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబరు 1098కు సమాచారం అందజేయాలని కోరారు. బాలల హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్, చైల్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నాయుడు, ఐసీడీఎస్ సీడీపీవో మంగమ్మ, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.