Thotapalli EO తోటపల్లి ఈవో బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:06 AM
Assumption of Duties by Thotapalli EO ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల ఈవోగా బండ్లముడి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో తోటపల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
గరుగుబిల్లి, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల ఈవోగా బండ్లముడి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో తోటపల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాగా శంబర పోలమాంబ ఆలయ ఈవోగా పనిచేసన ఆయనకు తోటపల్లి దేవస్థానం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ ఈవోగా ఉన్న వీవీ సూర్యనారాయణ ఇకపై పాల కొండలోని కోట దుర్గమ్మ ఆలయ బాధ్యతలు చూసుకోనున్నారు.