ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:57 PM
పక్కా ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలని నెల్లిమర్ల నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.నూక రాజు కోరారు.
నెల్లిమర్ల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): పక్కా ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు సహకరించాలని నెల్లిమర్ల నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.నూక రాజు కోరారు. బుధవారం నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పక్కా ఓటర్ల జాబితా తయారీకి ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలోని బూత్‌లెవల్ అధికారులు నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. మృతిచెందిన, వలసవెళ్లిన ఓటర్ల పేర్లు తొల గింపునకు, బూత్‌లెవల్ ఏజెంట్ల జాబితాను త్వరగా పంపించి రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధి కారులు కె.శ్రీకాంత్, ఎన్వీ రమణ, రాజారావు, రమణమ్మ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ వీవీఆర్ జగన్నాథరావు, రాజకీయ పక్షాల నాయకులు కనకల పద్మనాభం, ఎం.పాపారావు, డి.కామేశ్వరి పాల్గొన్నారు.