Share News

విశ్వసనీయతకు మారుపేరు అశోక్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:24 AM

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలు, విశ్వసనీయతకు మారుపేరుగా గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు నిలిచారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కొనియాడారు.

విశ్వసనీయతకు మారుపేరు అశోక్‌
గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజుని సన్మానిస్తున్న క్షత్రియ పరిషత్‌ ప్రతినిధులు

- ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

- గోవా రాష్ట్ర గవర్నర్‌కు సన్మానం

విజయనగరం రూరల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలు, విశ్వసనీయతకు మారుపేరుగా గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు నిలిచారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కొనియాడారు. నగరంలోని అయోధ్యమైదానం రోడ్డులో ఉన్న క్షత్రియ పరిషత్‌ కల్యాణ మండపంలో ఆదివారం అశోక్‌ గజపతిరాజును జిల్లా క్షత్రియ పరిషత్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ రఘురాజుతో పాటు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ఎంపిక కావడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత గవర్నర్‌ వ్యవస్థకు మరింత మరింత గౌరవాన్ని తెస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్‌ ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:24 AM