Share News

చీరకొంగు బైకు చక్రానికి చుట్టుకోవడంతో..

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:21 AM

భామిని మండలంలోని ఘనసర సమీపంలో పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన కొండేటి తవిటమ్మ (47) శనివారం బైక్‌ నుంచి కింద పడి మృతి చెందింది.

చీరకొంగు బైకు చక్రానికి చుట్టుకోవడంతో..

భామిని/పాలకొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని ఘనసర సమీపంలో పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన కొండేటి తవిటమ్మ (47) శనివారం బైక్‌ నుంచి కింద పడి మృతి చెందింది. బత్తిలి పోలీసుల కథనం మేరకు.. అన్నవరం నుంచి ఒడిశాలోని గుణుపూర్‌లో తన తల్లి సంవత్సరీక కార్య క్రమం నిర్వహణకు భర్త జనార్దనతో తవిటమ్మ బైక్‌పై బయలుదేరింది. ఘనసర సమీపంలో చీర కొంగు వెనుక చక్రానికి చుట్టడంతో బైక్‌ బోల్తా పడింది. దీంతో తవిటమ్మ తలపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సహకారంతో 108లో సీతంపేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్‌ఐ జి.అప్పారావు ఆధ్వ ర్యంలో ఏఎస్‌ఐ కాంతారావు కుటుంబ సభ్యుల వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాలకొండ ఆస్పత్రికి పోస్టుమార్టం తరలిం చినట్టు తెలిపారు. దీంతో అన్నవరంలో విషాదం నెలకొంది.

Updated Date - Jul 27 , 2025 | 12:21 AM