Share News

ఆలయాల్లో పటిష్ట చర్యలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:55 PM

శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతిచెందిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఆలయాల్లో పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించిందని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు.

  ఆలయాల్లో పటిష్ట చర్యలకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం రూరల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతిచెందిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఆలయాల్లో పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించిందని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆదివారం విజయనగరంలోని టీడీపీ కార్యా లయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాశీబుగ్గలో ప్రైవేటువ్యక్తులు ఆఽధీనంలో ఉన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. రెండు లక్షలు కలిపి మొత్తం రూ.17లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కర్రోతు నర్సింగరావు, గంటా రవి, గంటా పోలినాయుడు, కంది మురళీనాయుడు, అనురాధబేగం పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:55 PM