Kotadurgamma Festival కోటదుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్లు వేగవంతం
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:36 PM
Arrangements for Kotadurgamma Festival Speed Up కోటదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి ఎస్.రాజారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు.
పాలకొండ, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): కోటదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి ఎస్.రాజారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. బారికేడ్లు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న శాశ్వత ద్వారాలు తదితర విషయాలను ఈవో వీవీ సూర్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అసౌకర్యం కలగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, శానిటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంతకుముందు ఆయన అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.