Share News

Brahmotsavams తోటపల్లిలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:25 PM

Arrangements for Brahmotsavams at Totapalli చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు.

  Brahmotsavams తోటపల్లిలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
ప్రత్యేక అలంకరణలో వేంకటేశ్వర స్వామి

గరుగుబిల్లి, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఉత్సవాల నేప థ్యంలో అక్టోబరు 2 నుంచి 5 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దసరా పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు (పవిత్రోత్సవాలు) ఘనంగా ప్రారంభమ వుతాయన్నారు. 5న నాగావళి నదీ తీరంలో స్వామివార్లకు చక్ర తీర్థస్నానాలు నిర్వహిస్తామని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు.

Updated Date - Sep 26 , 2025 | 11:25 PM