Share News

illusion of YSRCP? ఇంకా వైసీపీ భ్రమలో ఉన్నారా?

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:32 PM

Are you still under the illusion of YSRCP? నిత్యవసర సరుకులను పంపిణీ చేసే ఎండీయూ వాహనంపై మాజీ సీఎం జగన్‌ ఫొటో ఉండడంపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నారా? అని సివిల్‌ సప్లైస్‌ అధికారులను ప్రశ్నించారు.

   illusion of YSRCP?  ఇంకా వైసీపీ భ్రమలో ఉన్నారా?
ఎండీయూ వాహనంపై మాజీ సీఎం జగన్‌ ఫొటో ఉండడంతో అధికారులను నిలదీస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): నిత్యవసర సరుకులను పంపిణీ చేసే ఎండీయూ వాహనంపై మాజీ సీఎం జగన్‌ ఫొటో ఉండడంపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నారా? అని సివిల్‌ సప్లైస్‌ అధికారులను ప్రశ్నించారు. బుధవారం 11, 12వ వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎండీయూ వాహనంపై మాజీ సీఎం జగన్‌ బొమ్మ చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు కూడా ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వెంటనే సివిల్‌ సప్లైస్‌ అధికారులతో మాట్లాడారు. వాహనంపై మాజీ సీఎం ఫొటో ఇంకా ఎందుకు ఉంచారో తెలియజేయాలన్నారు. ఎండీయూ డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బి.జయప్రకాష్‌ నారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 11:32 PM