Share News

Sanctioned? మంజూరవుతున్నాయా?

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:25 PM

Are They Being Sanctioned? జిల్లాలోని అనేక చోట్ల గ్రానైట్‌, మెటల్‌ క్వారీలు నిర్వహిస్తున్నా.. పంచాయతీలకు సీనరేజ్‌ నిధులు మంజూరు కావడం లేదు. దీంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  Sanctioned? మంజూరవుతున్నాయా?

  • కేటాయించడం లేదంటున్న సర్పంచ్‌లు

  • జనరల్‌ నిధుల్లో కలుపుతున్నామని అధికారుల వెల్లడి

పార్వతీపురం, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అనేక చోట్ల గ్రానైట్‌, మెటల్‌ క్వారీలు నిర్వహిస్తున్నా.. పంచాయతీలకు సీనరేజ్‌ నిధులు మంజూరు కావడం లేదు. దీంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా గనుల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ నుంచి జిల్లా పరిషత్‌, జిల్లా పంచాయతీ , మండల పరిషత్‌ కార్యాలయాలకు సీనరేజ్‌ నిధులు జమ కావాల్సి ఉంది. కానీ అవి జమ కావడం లేదని అనేక మంది సర్పంచ్‌లు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం మరోలా సమాధానమిస్తున్నారు. జనరల్‌ నిధుల్లో వాటిని కలుపుతున్నామని చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో గ్రానైట్‌, మెటల్‌ క్వారీలు 64 వరకూ ఉన్నాయి. ఇందులో కొన్ని పనిచేయడం లేదు. మెటల్‌ క్వారీల్లో తవ్వకాలకు సంబంధించి పంచాయతీలు, మండల పరిషత్‌కు సీనరేజ్‌ నిధులు మంజూరు కావాల్సి ఉంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలకూ నిధులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్న ప్పటికీ సర్పంచ్‌లు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఒక్క పైసా కూడా రావడం లేదంటున్నారు. వాస్తవంగా సీనరేజ్‌ రూపంలో వచ్చిన నిధుల్లో 25 శాతం పంచాయతీలు, 50 శాతం మండల పరిషత్‌లు, మరో 25 శాతం జిల్లా పరిషత్‌లకు మంజూరు కావాల్సి ఉంది. జనరల్‌ నిధుల్లో కలుపుకుని ఈ నిధులు మండల పరిషత్‌, పంచాయతీలకు జమ కావాల్సింది. కాగా ప్రభుత్వం జమ చేస్తే సీనరేజ్‌ రూపంలో పంచాయతీలకు వచ్చిన ప్రత్యేక నిధుల గురించి తమకు తెలియజేయాలని పలువురు సర్పంచ్‌లు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల తమ ప్రాంతంలో నిర్వహించే క్వారీల ద్వారా పంచాయ తీలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుందని వారు చెబుతున్నారు. దీనిపై గనులశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా.. సీనరేజ్‌ రూపంలో తమ శాఖ ద్వారా చెల్లించాల్సిన నిధులు నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తున్నామన్నారు. ఈ నిధులు ప్రభుత్వం ద్వారా జడ్పీ, మండల పరిషత్‌ , పంచాయతీలకు జమ అవుతాయని వెల్లడించారు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ కార్యాలయ సూపరింటెండెంట్‌ వద్ద ప్రస్తావించగా..సీనరేజ్‌ నిధులు పంచాయతీలకు మంజూరువుతున్నాయని, జనరల్‌ నిధుల్లో వాటిని కలుపుతున్నామని తెలిపారు.

Updated Date - Oct 10 , 2025 | 11:25 PM