యథేచ్ఛగా శ్మశాన వాటికల ఆక్రమణ
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:32 PM
ww
నెల్లిమర్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి):చంపావతి నది గర్భంలో ఉన్న శ్మశానవాటికలు ఆక్రమణలకు గురవుతున్నాయి. శ్మశాన వాటికల్లో మృతదేహాలను పాతేందుకు కూడా స్థలం లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి నదిని గుల్లచేస్తున్నారు. కొండపేట వద్ద శ్మశానవాటికలో నెల్లిమర్ల నగరపంచాయతీ, రెవెన్యూఅధికారుల అండదండలతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని విమర్శలొస్తున్నాయి. ఆదివారం కొండపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవడంతో ఖననంచేసేందుకు స్థలం లేకపోవడంతో గ్రామస్థులు అవస్థలకు గురయ్యారు. ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడినవారు శ్మశానవాటికలను సైతం విడిచిపెట్టడం లేదని వాపోయారు. నెల్లిమర్ల నియోజకవర్గం లో చంపావతి నది పరివాహక ప్రాంతంలో నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు శ్మశానవాటికలుగా వినియోగిస్తున్నారు.ఈతరుణంలో ఇసుకను రాత్రిపూట యంత్రాలతో తరలిస్తుండడంతో ఎవరైనా చనిపోతే నదిలో గోతుల నడుమ అంత్యక్రియలు నిర్వహిం చాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు.యథేచ్ఛగా నదీలో ఆక్రమిస్తున్నా అధికా రులు చోద్యంచూస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.