Share News

అక్విడక్టులు ఇలా.. సాగునీరు ఎలా?

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:42 PM

మండలంలోని ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువపై ఉన్న అక్విడక్టులు శిథిలావస్థకు చేరా యి.

అక్విడక్టులు ఇలా.. సాగునీరు ఎలా?
ఉల్లిభద్ర సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువపై శిథిలావస్థలో ఉన్న అక్విడక్టు

పిచ్చిమొక్కలతో నిండిపోయిన దోనెలు

శిథిలావస్థకు చేరడంతో లీకవుతున్న నీరు

దృష్టి సారించని యంత్రాంగం

గరుగుబిల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువపై ఉన్న అక్విడక్టులు శిథిలావస్థకు చేరా యి. దీంతో అక్విడక్టుల నుంచి రెండు వైపులా నీరు లీకవుతుంది. చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో అక్విడక్టులు కనిపించడం లేదు. జం ఝావతి ప్రాజెక్టు నుంచి గరుగుబిల్లి మండలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో పదేళ్ల కిందట టీడీపీ ప్రభు త్వ హయాంలో సుమారు రూ.40లక్షల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో అక్విడక్ట్టు లు, కాలువలు నిర్మించారు. ఇందులో భాగంగా ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువపై రెండు అక్విడక్టులను ఏర్పాటు చేశారు. ఒక ఆక్విడెక్టు ద్వారా ఉల్లిభద్ర, దళాయివలస, తులసిరామి నాయుడువలస, మరో అక్విడక్టు ద్వారా కొంకడివరం, సీతారాంపురం, శివరాం పురంతో పాటు పలు గ్రామాలకు సంబంధించి సుమారు 5 వేల ఎకరా లకు సాగునీరు అందాల్సి ఉంది. అయి తే, ప్రస్తుతం అక్విడక్టులు, కాలువలు అత్యంత దయనీయంగా తయారయ్యా యి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటిపై అధికారులు అంతగా దృష్టి సారించలేదు. దీంతో అక్విడక్టుల చు ట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. అలాగే, దోనెల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా రెండు వైపులా సాగునీరు లీకు అవు తుంది. కాలువలో ఏడు కిలో మీటర్ల మేర పిచ్చి మొక్కలు, పూడికలు తొలగించారు. ఇంకా 35 కిలో మీటర్ల మేర గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉంది. ఈ నెల 10న జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని రబ్బరుడ్యాం నుంచి సాగునీరు విడుదల చేశారు. కాలువలో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఉల్లిభద్ర ప్రాంతంలోని అక్విడక్టులతో పాటు కాలువలను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:42 PM