102 చెరువు పనులకు రూ.56కోట్లతో ఆమోదం
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:00 AM
జల వనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేన్, రెస్టారేషణ్(ఆర్‌ఆర్‌ఆర్) కింద రూ.56 కోట్ల అంచనాతో 102 చెరువు పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 25(ఆంధ్ర జ్యోతి): జల వనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేన్, రెస్టారేషణ్(ఆర్‌ఆర్‌ఆర్) కింద రూ.56 కోట్ల అంచనాతో 102 చెరువు పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన ఆధ్వర్యంలో ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ నిబంధ నలు అనుసరించి జిల్లాలో ఉన్న 7,900 చెరువులు ఉం డగా వాటిలో కేవలం 102 చెరువు పనులకే ప్రతిపాద నలు పంపడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల వారిగా ఉన్న చెరువులను పరిశీలించి ఈ నిబంధనల కిందకు వచ్చే వాటిని గుర్తించి మరిన్ని ఎక్కువ చెరువులను అభివృద్ధికి కృషి చేయాలని జల వనరులు శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిబంధనలలోనికి రాని చెరువులు ఏ కార ణంగా ఈ పరిధిలోకి రాలేదో కారణాలను కూడా వివ రించాలన్నారు. వచ్చే వారానికి మరో 500 చెరువులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జలవనరులు ఈఈ వెంకటరమణ, సిబ్బంది ఉన్నారు.
గిరిజన విశ్వవిద్యాలయం పనులను
వేగవంతం చేయాలి
కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణం పను లను వేగవంతం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. మెంటాడ, దత్తిరాజేరు మం డలాల్లో నిర్మితమవుతున్న గిరిజన విద్యాలయం పనుల పై గురువారం తన చాంబర్‌లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1.3 కిలో మీటర్ల మేర ప్రతిపాదించిన యూనివర్శిటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న విద్యుత్ హైటెషన్ వైర్లు, గేటు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెలుపలికి జరిపేందుకు చర్యలు ప్రారంభించాలని, ఈ మేరకు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులకు లేఖ రాయాలని సూచించారు. తాగునీటిని సరఫరా చేసే నిర్మాణాలన్ని పూర్తయ్యాయని, పంప్ హౌస్‌లకు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి తదితరులు ఉన్నారు.