Applicants' Satisfaction అర్జీదారుల సంతృప్తస్థాయి పెరగాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:36 AM
Applicants' Satisfaction Level Should Improve ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన సమస్యలపై అర్జీదారులు సంతృప్తిస్థాయి పెరగాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంఽధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన సమస్యలపై అర్జీదారులు సంతృప్తిస్థాయి పెరగాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంఽధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యల పరిష్కార విషయమై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు. అయితే శతశాతం సంతృప్తికరంగా ఉన్నట్టు అర్జీదారుల స్పందన ఉండాలని తెలిపారు. అలా లేకుంటే సంబంధిత అధికారులే బాధ్యులవుతారని వెల్లడించారు. వచ్చిన ప్రతి అర్జీకి జిల్లా అధికారి కచ్చితంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. ఎస్సీ వినియోగదారుల ఇళ్లను ఎంపీడీవోలతో సందర్శించి సూర్యఘర్‌పై అవగాహన కల్పించాలని, యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఈపీటీఎస్ ద్వారా ప్రతి శాఖలోని రికార్డులు, జీవోలను స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ శోభిక , సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.
సదరం, ‘తల్లికి వందనం’ కోసం ప్రత్యే విభాగం
సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపోతే ‘తల్లికి వందనం’ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. సచివాలయాల పనితీరుపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలన్నారు. రోజూ ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమస్యలపై చర్చించాలని సూచించారు.
12న డీ వార్మింగ్‌డే
జిల్లావ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (డీ వార్మింగ్ డే) నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వైద్యాధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అన్ని విద్యా సంస్థలకు ఆల్‌బెండాజోల్ మాత్రల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు తప్ప నిసరిగా మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 1,96,612 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఆల్ బెండాజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అర్జీదారులకు ఉచిత భోజనం
పార్వతీపురం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వచ్చే వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దాతల సహకారంతో సుమారు 500 మంది అర్జీదారులకు భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లో పలువురు అర్జీదారులకు స్వయంగా వడ్డించారు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో దూరం నుంచి వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు.