AP Team Selected జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏపీ జట్టు ఎంపిక
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:52 PM
AP Team Selected for National-Level Kabaddi Competitions జాతీయ స్థాయి అండర్-18 బాలుర కబడ్డీ పోటీలకు 14 మందితో తుది జట్టు ఎంపికైంది. ఆదివారం పాలకొండలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఎంపిక చేశారు. పాలకొండలో ఈ నెల 14 నుంచి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 28 మందితో కూడిన క్రీడాకారులకు హర్యానాకు చెందిన కోచ్ సితేంద్రమెహలా పర్యవేక్షణలో తర్ఫీదు ఇచ్చారు.
పాలకొండలో ముగిసిన కోచింగ్ క్యాంప్
పాలకొండ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి అండర్-18 బాలుర కబడ్డీ పోటీలకు 14 మందితో తుది జట్టు ఎంపికైంది. ఆదివారం పాలకొండలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఎంపిక చేశారు. పాలకొండలో ఈ నెల 14 నుంచి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 28 మందితో కూడిన క్రీడాకారులకు హర్యానాకు చెందిన కోచ్ సితేంద్రమెహలా పర్యవేక్షణలో తర్ఫీదు ఇచ్చారు. దీనిలో భాగంగానే ఆదివారం రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నుంచి అండర్-18 కబడ్డీ క్రీడాకారుల తుది జట్టును ఎంపిక చేశారు. 22 మంది జట్టు సభ్యుల్లో 14 మందిని ఎంపిక చేశారు. వీరితో పాటు మరో ఇద్దరిని అదనంగా తుది జట్టుకు జతచేశారు. వారంతా ఈ నెల 28 నుంచి జూలై 2 వరకు హరిద్వార్‌లో జరగనున్న జాతీయస్థాయి అండర్-18 బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనున్నారు. కబడ్డీ జట్టు రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, సెక్రటరీ వై.శ్రీకాంత్, ఎన్.అర్జునరావు, సుబ్బరాజు, రాంబాబు, సుధాకర్, చంద్రరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కొండలరావు కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే..
పి.మణికంఠ, కెప్టెన్ (పార్వతీపురం మన్యం జిల్లా), ఆర్.నరేంద్ర (ఎన్టీఆర్ జిల్లా), జి.హరీష్ (గుంటూరు), పి.హరీష్ (కాకినాడ), ఎన్.శివరామకృష్ణ (పల్నాడు), ఎం.సుమంత్ (ఎన్టీఆర్ జిల్లా), పి.లక్ష్మీనారాయణ (ఈస్ట్ గోదావరి), ఎ.అభిలాషరెడ్డి (కడప), కె.శ్రీనివాసరావు (నెల్లూరు), కె.జాన్ (కాకినాడ), ఎ.వెంకగోపి (పల్నాడు), కె.ప్రశాంత్ (గుంటూరు), ఐ.సుమంత్ (విజయనగరం), ఎస్.రామమోహన్‌రావు (శ్రీకాకుళం) అండర్-18 కబడ్డీ జట్టులో ఉన్నారు. మన్యం జిల్లా కోచ్‌గా వి.చంద్రరావు (శేఖర్), మేనేజర్‌గా సితేంద్రమెహలా వ్యవహరిస్తున్నారు.