AP NGO ఏకగ్రీవంగా ఏపీ ఎన్జీవో ఎన్నికలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:22 AM
AP NGO Elections Held Unanimously పార్వతీపురం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తొలుత నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. సింగిల్ సెల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ఎన్నికల అధికారులు టి. శ్రీధర్‌బాబు, సురేష్ ప్రకటించారు.
పార్వతీపురం, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తొలుత నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. సింగిల్ సెల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ఎన్నికల అధికారులు టి. శ్రీధర్‌బాబు, సురేష్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా నూతన అధ్యక్షుడిగా జీవీఆర్‌ఎస్ కిషోర్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జి.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.రామకృష్ణ, టి.వెంకటనాయుడు, ట్రెజరీలుగా వై.జయ ప్రకాష్, పి.సురేష్‌కుమార్ పి.పద్మ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్.పద్మ, కార్యదర్శిగా కె.రంగాచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.విజయకుమార్, జాయింట్ సెక్రట రీలుగా వి.శ్రీనివాసరావు, సి.హెచ్.శంకరరావు, వి.గణపతిరావు, పి.చంద్రశేఖర్, ఎం.శ్రీధర్, రేఖావాణి ఎన్నికయ్యారు. అనంతరం వారితో ఎన్నికల పరిశీలకులు రంజిత్‌నాయుడు, విజయ నగరం జిల్లా ఎన్‌జీవో ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, జాయింట్ సెక్రటరీ ఆర్.స్వప్న తదితరులు ప్రమాణం చేయించారు. తమ సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిషోర్ తెలిపారు. తనపై ఎంతో నమ్మ కంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యాచరణను విజయ వంతం చేయా లని సంఘం మాజీ నాయకులు రామ్మూర్తినాయుడు, సంగమేశ్వరరావు, త్రినాథం, జగన్నాథం నాయుడు కోరారు. అంతకుముందు ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహంచారు.