Anvesha Science Fest 23, 24 తేదీల్లో అన్వేష సైన్స్ ఫెస్ట్
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:32 PM
Anvesha Science Fest on 23rd and 24th సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నతపాఠశాలల్లో ఈనెల 23,24 తేదీల్లో అన్వేష సైన్స్‌ఫెస్ట్‌ను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీతంపేట రూరల్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నతపాఠశాలల్లో ఈనెల 23,24 తేదీల్లో అన్వేష సైన్స్‌ఫెస్ట్‌ను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సైన్స్‌ఫెస్ట్‌లో ఏడు థీమ్స్‌పై ప్రయోగాలు ఉంటాయన్నారు. దీని నిర్వహణకు గాను 9న కమిటీలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఇందులో 6,7,8 తరగతుల విద్యార్థులు జూనియర్ విభాగంలోను, 9,10 తరగతులు విద్యార్థులు సీనియర్ విభాగంలో పాల్గొంటారని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ, గురుకుల పాఠశాలల నుంచి కనీసం ఆరు ప్రాజెక్ట్‌లు(విద్యార్థుల ప్రాజెక్ట్‌లు 5,ఉపాధ్యాయ ప్రాజెక్ట్ 1)లకు తక్కువ కాకుండా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అన్వేష సైన్స్‌ఫెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు, గైడ్, ఎస్కార్ట్ ఉపాధ్యాయులు ఈనెల 22న సాయంత్రం వేదిక వద్దకు చేరుకొని రిజిస్రేషన్ చేయించుకోవాలని సూచించారు.