Mega DSC మెగా డీఎస్సీలో మరో అడుగు
ABN , Publish Date - May 31 , 2025 | 11:37 PM
Another Step Forward in Mega DSC మెగా డీఎస్సీలో మరో అడుగు పడింది. పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించ నున్నట్లు శనివారం వెల్లడించింది. కాగా అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
సాలూరు రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో మరో అడుగు పడింది. పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించ నున్నట్లు శనివారం వెల్లడించింది. కాగా అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తంగా 18,001 మంది నిరుద్యోగ అభ్యర్థులు 31,038 దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకులు క్యాడర్‌లో తెలుగులో 14, హిందీలో 14, ఆంగ్లంలో 23, గణితంలో 8, భౌతికశాస్త్రంలో 32, జీవశాస్త్రంలో 20, సాంఘిక శాస్త్రంలో 62, పీఈటీ 63 చొప్పున మొత్తం 446 టీచర్ ఖాళీలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60, పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లంలో 7, గణితంలో 25, భౌతిక శాస్త్రంలో 24, జీవశాస్త్రంలో 16, సాంఘిక శాస్త్రంలో 5 చొప్పున మొత్తం 137 పోస్టులు ఖాళీలుగా చూపించారు. మొత్తంగా 583 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా ఉత్తరాంధ్ర పరిధిలోని డిఫరెంట్ ఏబుల్డ్ పాఠశాలల్లో టీచర్ పోస్టులు సైతం ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చాయి.