హామీలు నెరవేర్చకుంటే మరో పోరాటం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:11 AM
మున్సిప ల్ కార్మికుల 17 రోజుల సమ్మె సందర్భంగా మున్సిపల్ పరిపాలన అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే మరో పోరాటానికి సిద్ధమపడతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూని యన్ జిల్లా కమిటీ తెలిపింది.
సాలూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ కార్మికుల 17 రోజుల సమ్మె సందర్భంగా మున్సిపల్ పరిపాలన అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే మరో పోరాటానికి సిద్ధమపడతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూని యన్ జిల్లా కమిటీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసి స్తూ పురపాలక సంఘం కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా చేపట్టాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఈసందర్భంగా ఏపీ మున్సిప ల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్‌వై.నాయుడు, సాలూరు పట్టణ అధ్యక్షుడు తుపాకుల రాముడు మాట్లాడుతూ రాష్ట్రంలో 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం తరపున అధికారులు చేసుకున్న మినిట్స్ ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాల రిటైర్‌మెంట్ వయస్సు పెంచాలని కోరారు. సాలూరు మున్సిపాలిటీలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతిచెందిన వారికి నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని, వారి కుటుంబాలు ఉద్యోగం ఇవ్వలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పోలరాజు రవి, మహిళా నాయకులు స్వప్న, మీడియా ఇన్‌చార్జి శ్రీను పాల్గొన్నారు.