Another 3 months మరో 3 నెలలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:59 PM
Another 3 months లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల 23 తో ముగిసిన నేపథ్యంలో ఆ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. అనధికార లేఅవుట్ యజమానులకు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది వరం లాంటిది. 2026 జనవరి 23 వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువును పొడిగించడంతో సంబంధిత భూ యజమానులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు మరోసారి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
మరో 3 నెలలు
అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు
తాజాగా జీవో జారీ
బొబ్బిలి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల 23 తో ముగిసిన నేపథ్యంలో ఆ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. అనధికార లేఅవుట్ యజమానులకు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది వరం లాంటిది. 2026 జనవరి 23 వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువును పొడిగించడంతో సంబంధిత భూ యజమానులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు మరోసారి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
2020లో అనధికార లేఅవుట్స్, ప్లాట్ల క్రమబద్ధీకరణకు జారీ అయిన జీవోలు 1, 2 లకు అనుగుణంగా ఈ కొత్త జీఓ వర్తిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ని వినియోగించుకోవాలని కోరుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే సచివాలయాల పరిధిలో విస్తృతస్థాయిలో ప్రచారం, అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. సాఽధారణంగా మున్సిపాలిటీకి 14 శాతం ఫీజును చెలించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ సదుపాయాన్ని వినియోగించుకుంటే అందులో సగం ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా అనధికార లేఅవుట్ లేదా వ్యక్తిగత స్థలాలను అధికారికం చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా లేఅవుట్లను, స్థలాలను క్రమబద్ధీకరించుకున్న వారికి పూర్తిస్థాయి హక్కులు వస్తాయి. బ్యాంకు రుణాలు పొందడానికి, ఇతరత్రా అధికారికమైన లావాదేవీలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.
- బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 270 అనధికారిక లేఅవుట్లను గుర్తించారు. ఇందులో 229 లేఅవుట్లను అప్రూవ్ చేశారు. పది లేఅవుట్లకు సంబంధించి చెల్లింపులు జరిపారు. వ్యక్తిగత అఽనధికార ఇళ్లస్థలాల లేఅవుట్లకు సంబంధించి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- 45 రోజుల్లోగా పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే పదిశాతం, 90 నోజుల్లో 5 శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఓపెన్ స్పేస్ లేనప్పుడు భూమి విలువపై 7 శాతం అదనపు చార్జీలు అంటే 14 శాతంలో సగం రాయితీ లభిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
లాలం రామలక్ష్మి, మున్సిపల్ కమిషనరు, బొబ్బిలి
పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ప్రకటించింది. అనధికారికంగా లేఅవుట్లు, ప్లాట్లు కలిగిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్ సదుపాయాన్ని వినియోగించుకున్న వారికి మున్సిపాలిటీల నుంచి ఎల్‌పి నెంబరు జారీ అవుతుంది. క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. సునాయాసంగా అనుమతులు లభిస్తాయి. ఆస్తివిలువ పెరిగి భద్రత లభిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.