Share News

Annadata Sukhibhava' ‘అన్నదాత సుఖీభవ’ విజయోత్సవం

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:36 PM

Annadata Sukhibhava' Victory Celebrations అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆదివారం పాలకొండలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీతంపేట రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్‌ యార్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

 Annadata Sukhibhava' ‘అన్నదాత సుఖీభవ’ విజయోత్సవం
ర్యాలీలో పాల్గొన్న ట్రాక్టర్లు

పాలకొండ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆదివారం పాలకొండలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీతంపేట రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్‌ యార్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలు దగాకు గురయ్యారన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎరువుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందిస్తుందని వెల్లడించారు. విత్తనాల పంపిణీ నుంచి ఎరువులు, సాగునీరు తదితర విషయాల్లో రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:36 PM