Share News

andhrajyothi help to people through news అండగా నిలిచి.. అవస్థలు తీర్చి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:16 AM

andhrajyothi help to people through news సుదీర్ఘకాలంగా విజయనగరంలోని ఉడాకాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. తాగునీటి సరఫరా మెరుగు పడింది. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల ఆగడాలు తప్పాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు చెక్‌ పడింది. ముఖ్యంగా గాంధీపార్కునకు ప్రహరీ నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి. ఇటీవల పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. ఇవన్నీ ఆంధ్రజ్యోతి జనవరి 28న చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సభతోనే సాకారమయ్యాయి.

andhrajyothi help to people through news అండగా నిలిచి.. అవస్థలు తీర్చి
అభివృద్ధి చేయనున్న గాంధీపార్కు ఇదే

అండగా నిలిచి.. అవస్థలు తీర్చి

ఉడాకాలనీ వాసులకు ఊరట

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంతో అభివృద్ధి

ప్రధాన సమస్యలకు పరిష్కారం

రేపు నేతలు, అధికారులతో సభ

సుదీర్ఘకాలంగా విజయనగరంలోని ఉడాకాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. తాగునీటి సరఫరా మెరుగు పడింది. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల ఆగడాలు తప్పాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు చెక్‌ పడింది. ముఖ్యంగా గాంధీపార్కునకు ప్రహరీ నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి. ఇటీవల పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. ఇవన్నీ ఆంధ్రజ్యోతి జనవరి 28న చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సభతోనే సాకారమయ్యాయి. ఆ సమావేశంలో ప్రజలు విన్నవించిన సమస్యలను నేతలు, అధికారులు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులతో మాట్లాడేందుకు ఈ నెల 12న నేతలు, అధికారులతో మరోసారి సభ జరుగనుంది.

విజయనగరం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):

విజయనగరంలోని ఉడాకాలనీ వాసులు చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సౌకర్యాలకు నోచుకోక, ఎలాంటి అభివృద్ధి పనులు జరగక, కీలకమైన గాంధీ పార్కు ఉపయోగపడక అవస్థలు పడుతున్నారు. వీటికి పరిష్కారం చూపాలని ‘ఆంధ్రజ్యోతి’ సంకల్పించి ఈఏడాది జనవరి 28న ’అక్షరం అండగా..పరిష్కారమే అజెండగా’ కార్యక్రమాన్ని ఉడాకాలనీ ఫేజ్‌-2లోని గాంధీ పార్కులో నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమానికి ముందు, కార్యక్రమం తరువాత ఆంధ్రజ్యోతి ఆయా సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వార్తల రూపంలోనూ ప్రచురించింది. ఆపై అధికారులు స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కాలనీలో నీటి సరఫరాకు సంబంధించి కొత్త మోటార్లు బిగించారు. దీంతో తాగునీటి సమస్యలు తీరాయి. కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి అక్రమించడంతో రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించి కబ్జా కాకుండా చూశారు. ఉడాకాలనీలో మద్యంషాపు వద్ద బహిరంగంగా మద్యాన్ని సేవించడం పూర్తిగా తగ్గింది. మందుబాబుల ఆగడాలు ఇప్పుడు లేవు. కాగా గాంధీపార్కునకు ప్రహరీ, పార్కులో విద్యుత్‌ లైట్లు పనిచేయడం లేదు. గోడ బాగాలేకపోవడం వల్ల పందులు, కుక్కలు లోపలికి వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కూడా అడుగులు పడ్డాయి. ఈ నెల 2న గోడ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో ఉడాకాలనీ సమస్యలు పరిష్కారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రూ.35 లక్షల 85 వేలతో గాంధీ పార్కు అభివృద్ధి

ఉడాకాలనీ ఫేజ్‌-2లోని గాంధీ పార్కు అభివృద్ధికి విశాఖ మెట్రోపాలిటీన్‌ రీజయన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) రూ.35 లక్షల 85 వేలు కేటాయించింది. ఈ పనులకు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ నల్లనయ్య తదితరులు ఈ నెల 2న శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ, కాంట్రాక్టరుకు మధ్య ఒప్పంద ప్రక్రియ నడుస్తోంది. నెలాఖరులోగా ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

ఫ ’అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంతో జరిగిన అభివృద్ధిపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఉడాకాలనీ ఫేజ్‌-2లో మంగళవారం సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య, 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ సత్యవతి, వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, పలు విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్‌ సోమశంకరరావు, ఎడిషన్‌ ఇన్‌చార్జి బయపరెడ్డి హాజరుకానున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:16 AM