రాజ్యాంగంపై అవగాహన అవసరం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:23 AM
రాజ్యాంగంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం నగరంలోని బాబామెట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠ శాలలో జాతీయ న్యాయసేవాసంస్థ దినోత్స వాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు, వ్యాసరచనపోటీలను నిర్వహించారు. బాలికలకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్‌పై వ్యాసరచనపోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానంచేశారు.
విజయనగరం క్రైమ్, నవంబరు7 (ఆంధ్ర జ్యోతి): రాజ్యాంగంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం నగరంలోని బాబామెట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠ శాలలో జాతీయ న్యాయసేవాసంస్థ దినోత్స వాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు, వ్యాసరచనపోటీలను నిర్వహించారు. బాలికలకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్‌పై వ్యాసరచనపోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానంచేశారు.
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి
రాజాం రూరల్, నవంబరు 7 (ఆంరఽధజ్యోతి): విద్యార్థులు తరగతులకు సంబంధించిన పుస్తకాలతో పాటు ప్రముఖుల రచనలను కూడా చదవడం అలవాటు చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.శారదాంబ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీవిద్యానికేతన్, దిసన్‌స్కూల్‌లో తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు జాతీయ న్యాయ సేవాదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక హక్కులు, విధులు, రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బి.జోషిక, డి. వేదహర్షిత, బి.స్వప్న ప్రియ వరుసగా ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కైవశం చేసుకున్నారు. విజేతలకు అబ్దుల్ కలాం, సుధామూర్తి రచనలను న్యాయాధికారి శారదాంబ అందజేశారు. కార్యక్రమంలో జూనియర్ న్యాయాధికారి నైమిష, గట్టి పాపారావు, వై.భారతి పాల్గొన్నారు.
న్యాయసేవలను వినియోగించుకోవాలి
కొత్తవలస, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : న్యాయ సేవలను అర్హులైన పేదలు వినియోగించుకోవలని కొత్తవలసకోర్టు న్యాయాధికారి డాక్టర్ సముద్రాల విజయ్ చందర్ కోరారు. న్యాయ సేవాదినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కొత్తవలస న్యాయవాద సంఘం సభ్యులతో కలిసి మోటార్‌సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టుల్లో రాజీకి వీలుపడే కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కాలాన్ని ఆదా చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది ఎంవీఎస్ గిరిబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.