బస్సు కింద పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:16 AM
కొత్తవలస జంక్షన్‌లోని ఎస్.కోట రోడ్డులో శుక్రవారం ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు.
కొత్తవలస, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కొత్తవలస జంక్షన్‌లోని ఎస్.కోట రోడ్డులో శుక్రవారం ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఎస్‌ఐ జోగారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం నుంచి ఎస్.కో ట వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొత్తవలస జంక్షన్‌లో ప్రయాణికులను దించి.. నెమ్మదిగా కదులుతోంది. అయితే అక్కడే కాలువ నిర్మాణం కోసం తవ్విన గోతులు ఉన్నాయి. ఆ గోతుల పక్కనే నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి రాముడు ఉరఫ్ రాము(69) నిల్చుని ఉన్నాడు. ప్రమాదవశాత్తు తూలిపోయి బస్సు వెనుక చక్రం కింద పడిపోయాడు. దీంతో బస్సు ఆయన తలపై నుంచి వెళ్లిపో యింది. రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అప్పలకొండ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఎస్.కోట తరలించారు.