చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:56 PM
తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది.
బొండపల్లి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండల కేంద్రం రుకనాన అచ్చన్న, గౌరిలకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మోదక ప్రియ(ఉరఫ్ మౌనిక)(16) బొండపల్లి మండలం లోని గొట్లాం శ్రీగాయత్రీ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు తీవ్ర తలనొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యింది. దీంతో కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విశాఖ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మళ్లీ కేజీహె చ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో శనివారం వేకువజామున ఆమె మృతిచెం దింది. బాలిక తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గౌరి దత్తిరాజేరు మండలంలో ఉపాధి క్షేత్ర సహాయకురాలుగా పనిచేస్తోంది. మృతురాలి అన్న య్య గిరి బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థిని అకాల మృతితో దత్తిరాజేరులో విషాద ఛాయలు అలముకున్నాయి. మోదక ప్రియకు ఎప్పుడూ అనారోగ్య లక్షణాలు ఉండేవని కుటుంబీకులు చెబుతున్నారు.