ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:58 PM
మండలంలోని గుణుపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందినట్లు డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.
డెంకాడ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుణుపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందినట్లు డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. నాతవలస నుంచి విజయనగరం వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారుడు గుణుపూర్ గ్రామ సమీపంలో గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన యు.అప్పలనర్సమ్మ(73)ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.