ఆటో బోల్తా పడి ఒకరి మృతి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:56 PM
చెరుకుపల్లి జంక్షన్ జాతీయ రహ దారిపై గురువారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు.
పాచిపెంట, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): చెరుకుపల్లి జంక్షన్ జాతీయ రహ దారిపై గురువారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో కొరాపుట్‌కు చెంది న కొమ్మాల సింధూరి (55) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం క్రిస్మస్ సందర్భంగా సామాన్లు కొనుగోలు నిమిత్తం సాలూరు పట్టణానికి వెళ్లారు. సామాన్లు కొనుగోలు చేసి అనంతరం తమ స్వగ్రామమైన ఒడిశాకు గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మండలంలోని చెరుకుపల్లి జంక్షన్‌కు వచ్చే సరికి అక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాన్‌కు ఆటోపై ఉన్న పరుపు తగలడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఒడిశాకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కొరాపుట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కొమ్మాల సింధూరి మృతి చెందాడు. గాయపడిన వారిలో సిత్తూరి సింధూరి, సింబారి కొర, సేతుకొర ఉన్నారు. మృతుడి కుమారుడు ప్రేమ సింధూరి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ బి.ముసలయ్య కేసు నమోదు చేశారు.