Share News

Amrit Bharat train gets grand welcome in Bobbili అమృత్‌భారత్‌ రైలుకు బొబ్బిలిలో ఘన స్వాగతం

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:09 AM

Amrit Bharat train gets grand welcome in Bobbili ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన బ్రహ్మపూర్‌-ఉద్నా (గుజరాత్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం సాయంత్రం బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. వాల్తేరు రైల్వే సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌, నార్త్‌ సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీరు ఎంవీ రమణ, మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు తదితరులు కొత్తరైలుకు ఘనస్వాగతం పలికారు.

Amrit Bharat train gets grand welcome in Bobbili అమృత్‌భారత్‌ రైలుకు  బొబ్బిలిలో ఘన స్వాగతం
బొబ్బిలిలో అమృత్‌భారత్‌ రైలుకు జెండా ఊపుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు

అమృత్‌భారత్‌ రైలుకు

బొబ్బిలిలో ఘన స్వాగతం

స్టేషన్‌లో జెండా ఊపిన మున్సిపల్‌ చైర్మన్‌ శరత్‌బాబు, రైల్వే అధికారులు

బొబ్బిలి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన బ్రహ్మపూర్‌-ఉద్నా (గుజరాత్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం సాయంత్రం బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. వాల్తేరు రైల్వే సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌, నార్త్‌ సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీరు ఎంవీ రమణ, మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు తదితరులు కొత్తరైలుకు ఘనస్వాగతం పలికారు. అదే రైలులో విజయనగరం నుంచి వస్తున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచందర్‌ను స్వాగతించారు. వీరిరువురితో పాటు రైల్వే అధికారులు రైలుకు లాంఛనంగా పచ్చజెండా ఊపారు. రైలు నడుపుతున్న పైలట్‌లను బీజేపీ నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రైల్వేస్టేషన్‌ను సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ శరత్‌బాబు మాట్లాడుతూ అమృత్‌భారత్‌ రైలుకు బొబ్బిలిలో హాల్ట్‌ ఇవ్వడం హర్షనీయమన్నారు. ఒడిశా నుంచి గుజరాత్‌ వరకు పలు రాష్ర్టాల మీదుగా వెళుతున్న ఈ రైలు బొబ్బిలి ప్రాంత రైల్వే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరమన్నారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ జీఎస్‌టీ బచత్‌ ఉత్సవ్‌లో భాగంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో అనేక రాష్ర్టాల మధ్య సామాజిక, ఆర్ధిక సంబందాలను మెరుగుపరిచే విధంగా అమృత్‌భారత్‌ రైలును ప్రవేశపెట్టారన్నారు. తొలుత రైల్వే జోనల్‌ సలహా మండలి సభ్యుడు నంబియార్‌ వేణుగోపాలరావు, సీనియర్‌ బీజేపీ నేత పుల్లెల శ్రీనివాసరావులు జ్యోతి ప్రజ్వలన చేశారు. బాలిక దామిని నృత్యప్రదర్శన, రైల్వే సిబ్బంది దేశభక్తి గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పెంట స్వామినాయుడు, ముగడ అనిల్‌కుమార్‌, ఈశ్వరరావు, చెలికాని కేశవ, మున్సిపల్‌ కౌన్సిలర్లు వెలగాడ హైమావతి, కళ్యంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 12:09 AM