ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:55 PM
వ్యవసాయ మార్కె టింగ్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార ఉత్సవాన్ని సాలూరులోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
సాలూరు, జూన్ 18(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కె టింగ్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార ఉత్సవాన్ని సాలూరులోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమ స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌గా ముఖీ సూర్యనారా యణ, వైస్ చైర్మన్‌గా మింది సింహాచలంతోపాటు పాలక వర్గ సభ్యులందరితో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రమా ణస్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, రాయితీలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత పాలకవర్గానికి ఉందని ఆమె తెలిపారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ.భంజ్‌దేవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టీ), గుళ్ల వేణుగోపాలనాయుడు, ఆముదాల పరమేశు, వెంకటరమణ, గూడెపు యుగంధర్‌తోపాటు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.