Share News

సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ కృషి

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:59 PM

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.

     సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ కృషి
రాజాం: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేస్తున్న కోండ్రు మురళీమోహన్‌

సంతకవిటి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని తలతంపరలో ఏర్పాటు చేసిన భారతరత్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలో చనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజాం వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లూరు గణేష్‌, టీడీపీ మండలాధ్యక్షుడు గట్టి భాను, పీఏసీఎస్‌ అధ్యక్షులు చెలికాని మహేష్‌కుమార్‌, సమతం శ్రీనివాసరావు, కాకరాపల్లి బండారు రామకృష్ణ, గుర వాన నారాయణరావు, శంకరరావు పాల్గొన్నారు.

ఫరాజాం,నవంబరు9(ఆంధ్రజ్యోతి):కులాల్లో ఐక్యతగాఉంటేనే సంఘాలు బలంగా ఉంటాయని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలో గల 14వ వార్డు ఆదర్శనగర్‌కాలనీలో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం శిష్టకరణ కుల సంఘం వనమహోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయ కులు కల్లెపల్లి శ్రీనివాసరావు అల్లిన మురళి, ఉరిటి శశిభూషణరావు, బలివాడ శ్రీని వాసరావు, కుప్పిలిరమేష్‌, నాగేంద్ర పాల్గొన్నారు.అనంతరం టీడీపీ కార్యాలయంలో కమీషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆకురాతి రామచంద్రరావు ఎమ్మెల్యేను కలి శారు. కాగా 11 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్య క్రమంలో టీడీపీపట్టణాధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, గోపి, పెంకి గౌరీశ్వరావు, కిమడి అశోక్‌కుమార్‌, పిన్నింటి మోహన్‌రావు, పైల వెంకటరమణ లక్షుభుక్త కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:59 PM