Kharif Season ఖరీఫ్‌నకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:26 PM
All Set for Kharif Season ఖరీఫ్ సీజన్‌కు సర్వం సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్ తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పూర్తిస్థాయిలో అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశా మన్నారు.
జియ్యమ్మవలస, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌కు సర్వం సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్ తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పూర్తిస్థాయిలో అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశా మన్నారు. మంగళవారం పెదబుడ్డిడిలో ఎంటీయూ 1318 రకం వరి విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలు వివరించారు. వరి గట్లపై కందులు సాగు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల పంట రక్షణతో పాటు అదనపు ఆదాయం పొందొచ్చని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులందరూ ఈ నెల 20లోగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. కౌలు రైతులు విధిగా కార్డులు చేయించుకోవాలని సూచించారు.