Share News

హామీలన్నీ అమలు చేశారు

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:10 AM

ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేశారని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

 హామీలన్నీ అమలు చేశారు

కొత్తవలస, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేశారని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం కొత్తవలస పంచాయతీ చీపురువలస గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి, సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై వివరించారు. అనంతరం గ్రామ మహిళలు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:10 AM