ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:56 PM
మొంథా తుఫాన్ పట్ల నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపా రు.
విజయనగరం టౌన్, అక్టోబరు(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ పట్ల నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపా రు. నగరంలోని పునరావాస కేంద్రాలను ఆయన ఆది వారం పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ నగరంలో మంగళ వీధి, గాడీఖానా ప్రాంతా లలోని 55 కుటుంబాలు లోతట్టు ప్రాంతాలలో నివా సం ఉన్నట్లు గుర్తించామని, వీరికి ఆయా ప్రాంతాల లోని పాఠశాలల్లో పునరావాసం ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని సచివాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూస్తున్నామని, పారిశుధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తుఫాన్ వల్ల నగరంవాసులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా 9849906486 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.