ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:46 PM
ఐదేళ్లలోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టరు ఎం.రామసుందర్‌రెడ్డి అన్నారు.
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 21(ఆంధ్ర జ్యోతి): ఐదేళ్లలోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టరు ఎం.రామసుందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో ఆయన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారం భించి, పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలను వేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈనెల 21 నుంచి 24 వరకూ సుమారు లక్షమంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 1,172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు పోలింగు కేంద్రాల్లో చుక్కలు వేయడంతో పాటు ఈనెల 22 నుంచి 23 వరకూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. దీని కోసం 5వేల మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 24న పట్టణ ప్రాం తాల్లో పోలియో చుక్కలు వేస్తారన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్క లు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఆయన వెంట నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, డీఎంహెచ్‌వో డా.జీవనరాణి, అడిషనల్ డీఎంహెచ్‌వో డా.కె.రాణి, డీఐవో అచ్యుతాకుమారి, డీఎన్‌ఎంవో అర్చనాదేవి, ఏరియా వైద్యులు అశోక్ కుమార్‌రాజు సిబ్బంది పాల్గొన్నారు.