Share News

Alert to Disasters విపత్తులపై అప్రమత్తం

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:07 AM

Alert to Disasters విపత్తులపై అమ్రపత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవరం కలెక్టరేట్‌లో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. రుతుపవనాల రాక , భారీ వర్షాలు, వరదలు, రక్షణ చర్యలపై చర్చించారు.

Alert to Disasters  విపత్తులపై అప్రమత్తం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): విపత్తులపై అమ్రపత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవరం కలెక్టరేట్‌లో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. రుతుపవనాల రాక , భారీ వర్షాలు, వరదలు, రక్షణ చర్యలపై చర్చించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. రెడ్‌ క్రాస్‌, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, వీఏవోలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల వల్ల ప్రజలు, పశు సంపద, పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. వాతావరణశాఖ హెచ్చరికలను మైకుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్లకు అవసరమైన వాటిని ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్‌ గ్రౌండింగ్‌ వేగవంతం కావాలని ఏపీఈపీడీసీఎల్‌ ఏడీలను ఆదేశించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, వార్డు స్థాయిల్లో శిబిరాలు నిర్వహించాలని, అక్కడే రిజి స్ర్టేషన్లు, బ్యాంకు రుణాలు మంజూరు వంటివి గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే రుణాలు మంజూరురైనా కొన్ని చోట్ల గ్రౌండింగ్‌ కాలేదని, అటువంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్‌ ఏఈలకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, డీఆర్‌వో హేమలత, డ్వామా, డీఆర్‌డీఏ, ఐిసీడీఎస్‌ పీడీలు కె.రామచంద్రరావు, ఎం.సుధారాణి, టి.కనకదుర్గ, డీఎంహెచ్‌వో భాస్కరరావు , ఐటీడీఏ ఏపీడీ మురళీధర్‌, వెలుగు పీడీ సత్యంనాయుడు, పార్వతీపురం, పాలకొండ మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:07 AM