Share News

Malaria మలేరియాపై అప్రమత్తం

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:01 PM

Alert on Malaria సీతంపేట ఏజెన్సీలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జోనల్‌ మలేరియా అధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆదేశించారు. శనివారం ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.

  Malaria  మలేరియాపై అప్రమత్తం
దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో సిక్‌రూంను పరిశీలిస్తున్న జేఎంవో

  • జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అందించాలి

సీతంపేట రూరల్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జోనల్‌ మలేరియా అధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆదేశించారు. శనివారం ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. మలేరియా పాజిటివ్‌ కేసులు, ఓపీ వివరాలను సూపరింటెండెంట్‌ శ్రీనివాస రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం దోనుబాయి పీహెచ్‌సీకి వెళ్లి.. మలేరియా కేసులను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. జ్వరపీడితులకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని వైద్యాధికారి భానుప్రతాప్‌ను ఆదేశించారు. ఆ తర్వాత దోనుబాయి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సిక్‌రూంను పరిశీలించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. సిక్‌ రూం కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయాలని, గదిని పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా ఆమె బూర్జగూడ గిరిజన గ్రామానికి చేరుకున్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వరాలపై ఆరా తీశారు. త్వరలో సీతంపేట ఏజెన్సీలో దోమ తెరలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పి.విజయపార్వతి, డీఎంవో సత్యనారాయణ, ఏఎంవో శ్రీనివాసరావు, మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి మోహనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:01 PM