Share News

Agency Areas ఏజెన్సీలో వ్యాధులపై అప్రమత్తం

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:10 PM

Alert on Diseases in Agency Areas ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం మొండెంఖల్‌ పీహెచ్‌సీని సందర్శించారు.

  Agency Areas ఏజెన్సీలో వ్యాధులపై అప్రమత్తం
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

కురుపాం, సెప్టెంబరు2(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం మొండెంఖల్‌ పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో జ్వరాలు, ఇతర వ్యాధులపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటివి ప్రబలకుండా చూడాలన్నారు. నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని సూచించారు. ముందుగా గర్భిణులు, చిన్నారుల రిజిస్ట్రేషన్లు, వారికి అందుతున్న సేవలు, ఇమ్యూనైజేషన్‌ చర్యలు, స్వర్ణాంధ్ర కేపీఐ ఇండికేటర్‌పై సమీక్షించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులు, లేబ్‌, వార్డు పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీఐవో విజయ మోహన్‌, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు,వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:10 PM