Alert మన్యంలో అలర్ట్
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:05 AM
Alert in the manyam అల్లూరి సీతా రామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్‌లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావో యిస్టులు మృతి చెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమ య్యారు.
విస్తృతంగా తనిఖీలు
పార్వతీపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతా రామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్‌లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావో యిస్టులు మృతి చెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమ య్యారు. మరోవైపు మావోయిస్టు గెరిల్లా దళాలు విజయవాడలోని ఆటోనగర్‌లో పోలీసులకు చిక్కడం, వారి నుంచి భారీ ఎత్తున ఆయు ధాలు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. దీంతో డీజీపీ హరిష్‌కుమార్ గుప్తా ఆదే శాల మేరకు జిల్లాలో పలు ప్రాం తాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు అన్ని ప్రాంతా లనూ జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఏజెన్సీ రహదారులు, ఏవోబీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు సీసీ కెమెరాల్లోంచి కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బుధవారం కూడా విజయ నగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారు.